7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

వింతజగతి


ఏది మలుపు ఏది పిలుపు

పిలుపుతోనే చేయి కలుపు

మలుపులన్నీ వెతికి కలుపు

కలుపు తీస్తే నీదె గెలుపు    .........ఏ.......

మంచినీడ చెడే పీడ

మంచి చెడుల మనసె గోడ

కల్ల లేని వెల్లవేయి

ఎల్లలన్నీ దాటవేయి         ........ఏ......

బ్రతుకు అంటే వద్దు వెఱపు

వెఱపు లేని బ్రతుకు గడుపు

గడువు ముగిసే రోజు వరకు

సగర్వంగా పోరు సలుపు    .........ఏ....

చీకటంటే కాదు నలుపు

చింతలేని దెవరు తెలుపు

ఎవ్వరైనా ఎరుగలేని

వింతజగతే ఓ కంటితుడుపు.          ......ఏ...

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి